prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 2:49 pm Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

చింతలపాలెంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించిన ధరావత్ నరసింహ.

చింతలపాలెంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించిన ధరావత్ నరసింహ.

మఠంపల్లి జూలై 24 (ప్రజావాణి)

తెలంగాణలో జూలై 24న నిర్వహించిన విద్యాసంస్థల బంద్ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో మండల నిరుద్యోగ కన్వీనర్ ధరావత్ నరసింహ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకుల సహకారంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, విద్యార్థులకు ఇంటర్ మార్కుల ఆధారంగా లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశ విధానం ప్రకారం మెడికల్ సీట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్‌టీఏను డిమాండ్ చేశారు.
నీట్ పరీక్షలో తరచూ అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిర్వహణలో లోపాలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో గ్రామీణ ప్రాంతాలు, పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ విధానాన్ని పునఃసమీక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బి.అనిల్, బి.ప్రసాద్, బి.నాగరాజు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.