prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 5:10 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

చరిత్రగల బాలయోగి గురుకుల పాఠశాల శిథిలావస్తేనా?

కోటిన్నర రూపాయలతో నూతనంగా నిర్మించిన భవనాలు ప్రారంభం కు నోచుకోక ముందే గాలికి వదిలేశారు కోట్లాది రూపాయలు భవనాలు శిథిలావస్థకు చేరుతున్న వైనం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బ్రహ్మంగారిమఠం ప్రాంతంపై ఎంతో అభిమానం గలవారు. కడప జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 1988వ సంవత్సరంలో బాలయోగి గురుకుల పాఠశాలలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మంగారిమఠంలో ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ గురుకుల పాఠశాలను చూడగానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు గుర్తుకొస్తారు. అటువంటి గురుకుల పాఠశాల నేడు శిధిలావస్థకు చేరుతుంది.

ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాలను తోట్లపల్లి లో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు తరలించడంతో నేడు మఠం లో ఉన్న గురుకుల పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయి.

ఎంతోమంది ఈ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించిన వారు వివిధ ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అలాంటి పేరు గల గురుకుల పాఠశాలలో ఇంకా అభివృద్ధి చేయకుండా మరొక చోటికి మార్చడంపై పూర్వపు విద్యార్థుల సైతం బాధలను వ్యక్త పరుస్తున్నారు.

కనీసం ప్రారంభం కూడా చేయని భవనాలను నిరుపయోగంగా వదిలేశారు. వీటి పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్, ఐటిఐ కాలేజీలను అయినా ఏర్పాటు చేసి కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.