prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 4:08 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

చమర్తి జగన్మోహన్ రాజు గారిచే పసుపు సైనికుడు గన్నే సుబ్బనరసయ్యకు అభినందనలు

రాజంపేట ప్రజావాణిన్యూస్(ఏప్రిల్13) మైటీడీపీ యాప్లో రాష్ట్రస్థాయిలో టాప్ 10 ర్యాంకులలో రాజంపేట నుంచి 5 వ ర్యాంకు సాధించిన పసుపు సైనికుడు గన్నే సుబ్బ నరసయ్య నాయుడుకి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గారు రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాజంపేట నియోజకవర్గం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు.అంకితభావం, క్రమశిక్షణ మరియు అలుపెరగని కృషిని ఇంచార్జ్ చమర్తి కొరియాడారు. పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేసిన వారికి పార్టీ నుంచి మరియు రాష్ట్ర భవిష్యత్తు నాయకులు నారా లోకేష్ గారు నేరుగా సముచిత గౌరవం ఉంటుందని దీనికి నిదర్శనం గన్నే అని తెలియజేశారు,గన్నే సుబ్బనరసయ్య గారు మాట్లాడుతూ టిడిపి, నారా లోకేష్ గారి ఆదేశానుసారం మై టిడిపి యాప్లో పనిచేయడం జరిగింది. ఈరోజు కష్టపడి పనిచేసినందున నేరుగా పార్టీ గుర్తించిందని, ప్రతి ఒక్కరు సూపర్ సిక్స్ పతకాలు, పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు మై టిడిపి యాప్ ద్వారా, నేరుగా ప్రతి ఇంటికి చేరేలా పనిచేసి ప్రతి ఒక్కరూ పార్టీ చేత సత్కరించబడాలని తెలియజేస్తూ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు .కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు, మండల అధ్యక్షులు మేడికొండ రవి, ఇడిమడకల కుమార్ రాష్ట్ర కార్యదర్శి, క్లస్టర్ ఇంచార్జ్ దగ్గుపాటి వెంకటేశ్వర్లు నాయుడు, సింగల్ విండో చైర్మన్ ముల్లగూరి సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ పరశురాం సింగన, రేవూరి నరసింహ, AMC వైస్ చైర్మన్ చంగల్ రాయుడు మందా శ్రీను కామినేని సతీష్ , మేకా నరసింహులు, పట్టిపాటి రవి మహిళా అధ్యక్షురాలు అనసూయమ్మ,, సాంబశివయ్య,రసూల్ మాజీ, దాసరి కళాధర్, మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు,బూతు కన్వీనర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.