చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాల మేళా.
•• 23న సిరిసిల్లలో జాబ్ మేళా నిర్వహణ.
••జిల్లా పరిశ్రమల శాఖ జి ఏం హన్మంత్ నాయక్
రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 23వ తేదీన సిరిసిల్ల జిల్లాలోని కే. కన్వెన్షన్ హాల్లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళాలో సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు చెందిన సుమారు 25 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలు (Skills) ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాలతో పాటు ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, టెన్త్ క్లాస్ చదివిన వారికి కూడా అవకాశాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా సెక్యూరిటీ సర్వీసెస్ రంగంలో కూడా నియామకాలు చేపట్టనున్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, యువజన సేవలు, ఉపాధి కల్పన శాఖలు సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి.
ఈ సదవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హన్మంత్ నాయక్ కోరారు.