prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 3:18 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి..కడప టూ టౌన్ సి.ఐ శ్రీహరి

వై.ఎస్.ఆర్ కడప మే17 ప్రజావాణి నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తన తో జీవించాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన  జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కడప టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి కడప ఇంచార్జి డి.ఎస్పీ ఇ. బాలస్వామి రెడ్డి గారి పర్యవేక్షణ లో కడప టూ టౌన్ సి.ఐ శ్రీహరి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు.సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కడప టూ టౌన్ సి.ఐ శ్రీహరి హెచ్చరించారు