prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 2:37 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

“చంద్రబాబు హామీలు నెరవేర్చలేకనే డైవర్షన్ పాలిటిక్స్ – కాకాణి

 నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02)సర్వేపల్లి నియోజకవర్గం,వీరంపల్లి,మనుబోలు గ్రామాల ల్లో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు “డా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో వ్యవసాయం చేయడం కష్టతరమవుతుందని కాకాణి ఎదుట ఆందోళన వ్యక్తం చేసిన రైతులు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులకు, నాయకులకు  ఒకటవ తేదీ కల్లా ప్రత్యక్షమై జగన్మోహన్ రెడ్డి,హయాంలో మంజూరైన పెన్షన్ లను కొంతమేర కోత విధించి పంపిణీ చేయడం తప్ప ,మరొకటి పట్టించుకున్న పాపాన పోలేదంటూ సమక్షంలో ఎద్దేవా చేసిన గ్రామస్తులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా,కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా,ఈ ప్రాంతానికి అవసరమైన రోడ్లు ,డ్రైన్ లు ,త్రాగునీటి వసతి,సాగునీటి వసతి,విద్యుత్ సౌకర్యాలు కల్పించారని గుర్తు చేసుకున్న గ్రామస్తులు జగనన్న హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి,ఇళ్ళు మంజూరు చేసి,పేదవాడికి గూడు కల్పించే లక్ష్యంతో పని చేస్తే చంద్రబాబు నాయుడు పేదల ఇళ్ల నిర్మాణ విషయంలో పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాకాణి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు తమకు చెందిన పొలాలను బలవంతంగా ఆక్రమించి,పోలీసుల చేత బెదిరించి తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ లిఖితపూర్వకంగా కాకాణి కి ఫిర్యాదు చేసిన స్థానిక రైతులు వీరంపల్లి గ్రామంలో వర్షం వస్తే మోకాలు లోతు నీటిలో అవస్థలు పడే వాళ్ళమని,వీరంపల్లి గ్రామంలోని ప్రధాన రహదారిని సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి గ్రామస్తులకు శాశ్వతంగా ఇబ్బందులు పాలు కాకుండా కాపాడిన కాకాణి ని మరిచిపోలేమంటున్న వీరంపల్లి వాసులు వీరంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జెట్టి సుధాకర్ రెడ్డి నూతనంగా ఇళ్ళు నిర్మించుకొని,ఇటీవల గృహప్రవేశం చేయడంతో సుధాకర్ రెడ్డి కి అభినందనలు తెలియజేసిన కాకాణి మనుబోలు మండల కేంద్రంలో ప్రముఖ జర్నలిస్ట్ జగదీష్ కు ఇటీవల మాతృ వియోగం కలగడంతో జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కాకాణి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రామాలలో అన్ని విధాల అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాం  గ్రామాలలో ఎక్కడా మట్టి రోడ్డు అనేది కనిపించకుండా,సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసాం సిమెంట్ రోడ్ల నిర్మాణం తో పాటు అవసరమైన చోట, అవకాశం ఉన్నచోట సిమెంట్ డ్రైన్ లు నిర్మించాం గ్రామాలలో మంచినీటి వసతి కల్పించాలని అనేక వాటర్ ట్యాంకులు మంజూరు చేయించాం పూర్తయిన స్థితిలో ఉన్న వాటర్ ట్యాంకులను నేడు రంగులు వేసుకొని కూటమి ప్రభుత్వంలో ప్రారంభించుకుంటున్నారు వీరంపల్లి గ్రామంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 300 మందికి పెన్షన్ వస్తే ,నేడు 600 మందికి పెన్షన్ లు వస్తున్నాయని గ్రామస్తులు చెప్పడం గమనర్హం చంద్రబాబు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని నిట్టనిలువునా మోసం చేశాడు జగనన్న ముఖ్యమంత్రిగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి,ఇళ్ల స్థలాలకు లేఅవుట్లు వేసి,పట్టాలు అందించాం ఇళ్ళు లేని నిరుపేదలందరికి ఇళ్లు మంజూరు చేయించి ఊళ్ళకు, ఊళ్లే నిర్మించాం గ్రామాలలో జగనన్న కాలనీలలో పర్యటిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోలేక,చేసిన అభివృద్ధిని చూసి తట్టుకోలేక రకరకాల విమర్శలకు దిగుతున్నారు-నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్లు పూర్తి చేయడం గాని  పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించడంలో గాని జగనన్న ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది చంద్రబాబు హామీ ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా,ఒక్క ఇళ్ళూ మంజూరు చేయకుండా జగనన్న హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను చూసి ప్రజలు గొప్పగా చెప్పుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ భరించలేకపోతోంది- తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ,జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఏదో ఒక విధంగా విమర్శలతో డైవర్షన్ పాలిటిక్స్ కు పూనుకుంటుంది-చంద్రబాబు 50 సంవత్సరాలు దాటిన వారందరికి పెన్షన్ ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు- దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్రోల్,డీజిల్ కొరత ఏర్పడింది-చంద్రబాబు అమరావతి పేరిట అన్ని విధాల దోపిడి కొనసాగిస్తూ,చివరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెట్రోల్,డీజిల్ దొరక్కుండా అమరావతి పేరిట దోపిడీకి పాల్పడడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ విధానాలను,పెట్రోల్, డీజిల్ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టడం చంద్రబాబుకు ఘోర అవమానం ఎరువుల ధరలు రోజురోజుకీ పెరగడంతో రైతులు వ్యవసాయం గిట్టుబాటు గాక తీవ్ర నిరాశ,నిస్పృహలకు లోనవుతున్నారు- చంద్రబాబు వ్యవసాయాన్ని గురించి పట్టించుకోకుండా రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ,ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్ళదీస్తున్నాడు-ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా చంద్రబాబును మట్టికరిపించి,మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి,ని ప్రజలు ముఖ్యమంత్రి ని చేయడం ఖాయం-ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల పెత్తనాన్ని పెంచి పోషిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు రాబోవు రోజుల్లో సరైన గుణపాఠం చెబుతాం అధికారంలో ఉన్నా,లేకున్నా,ప్రజల పక్షాన నిలబడి,ప్రజలకు అన్నివేళలా అండగా నిలుస్తాం