ఎన్టీఆర్ జిల్లా జూన్ 5 ప్రజావాణి నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల,పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు కంచికచర్ల పట్టణం నెహ్రు సెంటర్ నుండి చెవిటికల్లు సెంటర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ గా వెళ్లి ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల మేనిఫెస్టోను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు.డాక్టర్ జగన్మోహనరావు గారు మాట్లాడుతూ.గత వైసిపి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత,ఖురాన్, బైబిల్ లా భావించి ఇచ్చిన ప్రతి హామీను నిరవేర్చరని అన్నారు.నాణ్యమైన విద్య,వైద్యం అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం అని అన్నారు.ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ అబద్దపు,మోసపూరిత హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ఇది మంచి ప్రభుత్వం అంటూ వారే డప్పులు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు.ఈ రెండేళ్లలో మహిళలని నిరుద్యోగుల్ని,నిండా ముంచిన చంద్రబాబు.బాబు స్యూరిటీగా చెప్పాడంటే గ్యారెంటీగా మోసం చేస్తాడని మళ్లీ నిరూపించాడని పేర్కొన్నారు.ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500..నిరుద్యోగ భృతి నెలకు 3000.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ పథకాల హామీలు ఇచ్చి నేడు మాటే ఎత్తడం లేదని చంద్రబాబు పై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రతి ఓటరు ఈ చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని వెన్నుపోటు దారుల నడ్డి విరగొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బండి మల్లికార్జున రావు,పట్టణ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు,ఎంపీపీ మలక్ బషీర్, పాటిబండ్ల హరిజగన్నాధ రావు,మార్తా శ్రీను అమర్లపూడి యోహాను,దేవిరెడ్డి శ్రీనివాసరావు,మాడుగుల మధు,మాడుగుల శంకర్బ,ర్రెశంకరరావు, మేకల కోటేశ్వరావు,గుదే అక్కరావు,మంగళ పూడి సన్నీ,కోటిబాబు, పురుషోత్తం,పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.