నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) ముత్తుకూరు మండలం,ఈపూరు,రొయ్యలపాలెం, గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి,దువ్వూరు విశ్వ మోహన్ రెడ్డి,నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఐదవ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన మాజీ మంత్రి కాకాణి కి ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు రొయ్యలపాలెం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగుతున్నాయి, అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించడం సంతోషంగా ఉంది శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని. మా నాయకుడు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్కి అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నా జగన్మోహన్ రెడ్డి,చంద్రబాబు పాలనపై ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్న కాకాణి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా?అని ప్రశ్నించిన కాకాణి- పొరుగు రాష్ట్రాల విజయాలను చూసైనా పవన్ కళ్యాణ్,చంద్రబాబు నేర్చుకోవాలన్న జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఒంటరిగా పోరాడి,అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేసిన దొడ్డిదారి రాజకీయాలు మా రక్తంలోనే లేవన్న- జగన్ మోహన్ రెడ్డి పదవి నుంచి వైదొలిగిన తర్వాత రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎంతో బ్రహ్మాండంగా ఉండేదని,చంద్రబాబు నాయుడు పరిపాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు జగన్హ యాంలో పాలన ఎంత అద్భుతంగా సాగిందో ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం నాయకులు మహానాడు ఎక్కడ జరపాల అనే విషయం మీద పోట్లాడుకుంటున్నారు-నెల్లూరు జిల్లాలో మొత్తం 10కి 10 సీట్లు కందుకూరు తో కలిపి 11 సీట్లు గెలుస్తామని చెప్పా ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు ప్రజలతో సహా అందరికీ గునపంతో వెన్నుపోటు పొడవడం అలవాటు చేసుకున్నాడు చంద్రబాబు జీవితంలో వెన్నుపోట్లు తప్ప వేరేది లేదు బీదా రవిచంద్ర ప్రెస్ మీట్ పెట్టి నేను జోస్యం చెబుతున్నానని మాట్లాడాడు నా మాటలను కొందరు జోస్యంగా భావిస్తున్నారు,నేను చెప్పేది జోస్యం కాదు,ప్రజల నాడిని చెబుతున్నా కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న స్పందనను,భావాలను గమనించిన తర్వాతే నేను ఈ విషయాలు తెలుపుతున్నా టిడిపి నాయకులు పచ్చ కళ్లద్దాలు తీసి పక్కన పెట్టి, కళ్లల్లో ఉన్న అధికార పొరలను తొలగించుకుని వాస్తవాలను చూసి ,మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకుంటే మీకు నిజాలు తెలుస్తాయి- కూటమి పాలనలో జరుగుతున్న మోసాలను మేము స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్ళముందు కనిపిస్తుంది గత ఐదేళ్ల కాలంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి సౌకర్యం వంటి అనేక మౌలిక సదుపాయాలను కల్పించాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు ఏళ్లు గడుస్తున్నా గ్రామాల్లో కొత్తగా ఈ పనులు చేశామని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు
సీఎస్ఆర్ (CSR) నిధుల వినియోగంలో అవకతవకలు చేస్తూ,సైకిళ్ల కొనుగోలు వ్యవహారాల్లో డీలర్ల దగ్గర కమిషన్లు దండుకుంటూ టిడిపి నాయకులు తామేదో ఉద్దరిస్తున్నామని ప్రకటించడం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదు-జగన్ మోహన్ రెడ్డి ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేశారు, ఆయన ధైర్యాన్ని చూసి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ బుద్ధి తెచ్చుకోవాలి పొరుగు రాష్ట్రం తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో విజయన్ పూర్తి మెజార్టీ లేకపోయినా ఒక్కడే సొంతంగా పోటీ చేసి గెలిచాడు- నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, తన జీవితంలో ఒక్కసారైనా పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచిన సందర్భం ఉందా ప్రజల ఆశీస్సులు లేకనే చంద్రబాబు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడుతుంటాడు జగన్ మోహన్ రెడ్డి పేరును ఉచ్చరించే అర్హత కూడా కూటమి నాయకులకు లేదు- జగన్ గారు ఒంటరిగానే పోరాడి ముఖ్యమంత్రి అయ్యాడు,ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేశాడు బీద రవిచంద్ర ఎమ్మెల్యేగా పోటీ చేసే సత్తా లేక దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకున్నాడు,మేము ప్రజల్లో ఉండి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి,జిల్లా పరిషత్ చైర్మన్‌గా,రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాం కూటమి రాజకీయాలను నమ్ముకున్న చంద్రబాబు నాయుడు,జగన్ మోహన్ రెడ్డి ధైర్యం ముందు ఎప్పటికీ సరితూగడు చంద్రబాబు రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతోనే మొదలైంది,ఆయనకు ‘సైకిల్’ కంటే’గునపం’గుర్తే సరైనది నందమూరి తారక రామారావు చంద్రబాబును ‘దశమ గ్రహం’అని పిలిచేవాడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లాక్కుని,ఆయనకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది టీడీపీకి సైకిల్ గుర్తు కంటే ‘గునపం’ గుర్తు ఉంటేనే బాగుంటుంది చంద్రబాబు ఎవరినైనా వెన్నుపోటు పొడవడానికి, ప్రజల ఆస్తులను తవ్వి తరలించుకోవడానికి గునపంతో సిద్ధంగా ఉంటాడు,అందుకే గునపం గుర్తు ఆయనకు సింబాలిక్ గా సరిపోతుంది- తాము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటాం వారి కోసమే పని చేస్తాం రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోంది,ఇప్పటికైనా కూటమి నాయకులు పద్ధతి మార్చుకుని,తాము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అయినా ప్రజలకు మంచి పనులు చేస్తే బాగుంటుంది- ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నెల్లూరు ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు కందుకూరు నియోజకవర్గాన్ని కలిపి మొత్తం 11 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది 11 అసెంబ్లీ స్థానాలతో పాటు నెల్లూరు,తిరుపతి రెండు పార్లమెంట్ స్థానాలను కూడా వైయస్ఆర్ సీపీ అత్యంత భారీ మెజారిటీతో గెలుస్తుంది- అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది