చండూర్ ను వ్యసన రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం చండూర్ వాలా టీమ్
*చండూర్ ను వ్యసన రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం – చండూర్ వాలా టీమ్* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* "మన చండూర్ – మనం మార్చుకుందాం" అనే లక్ష్యంతో చండూర్ వాలా టీమ్ ఆధ్వర్యంలో మంగళవారం చండూర్ పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. మాదకద్రవ్యాలు, మద్యం, ధూమపానం, గుట్కా, డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రమాదకర బైక్ స్టంట్లకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు, యువతతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చండూర్ మున్సిపల్ కమిషనర్ మల్లేశం, చండూర్...