prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 6:38 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

చండూర్ ను వ్యసన రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం చండూర్ వాలా టీమ్

*చండూర్ ను వ్యసన రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం – చండూర్ వాలా టీమ్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

“మన చండూర్ – మనం మార్చుకుందాం” అనే లక్ష్యంతో చండూర్ వాలా టీమ్ ఆధ్వర్యంలో మంగళవారం చండూర్ పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. మాదకద్రవ్యాలు, మద్యం, ధూమపానం, గుట్కా, డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రమాదకర బైక్ స్టంట్లకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు, యువతతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చండూర్ మున్సిపల్ కమిషనర్ మల్లేశం, చండూర్ ఎస్సై జె. శివకుమార్, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెడ్‌మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని వారు పిలుపునిచ్చారు. చండూర్ వాలా టీమ్‌ కు చెందిన సుమారు 50 మంది సభ్యులు సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా చండూర్ వాలా టీమ్ సభ్యులు మాట్లాడుతూ, “మన చండూర్ – మనం మార్చుకుందాం” అనే సంకల్పంతో భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. “Together We Can Change – Say No to Drugs, Choose Life, Choose a Better Future” అనే సందేశంతో నిర్వహించిన ఈ ర్యాలీ చండూర్ పట్టణ ప్రజల్లో చైతన్యం కలిగించిందని పలువురు అభిప్రాయపడ్డారు.