చండూరు ఆర్టీసీ బస్ సర్వీసులను పునరుద్ధరించండి – కళ్ళెం సురేందర్ రెడ్డి

*చండూరు ఆర్టీసీ బస్ సర్వీసులను పునరుద్ధరించండి - కళ్ళెం సురేందర్ రెడ్డి* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* దేవరకొండ నుంచి చండూరు మీదుగా నల్లగొండకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులు గత నెల రోజుల నుంచి నిలిపివేయడంతో కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్ల తల్లులు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఉద్యమకారులు కళ్ళెం సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన చండూరు బస్టాండ్ లో మాట్లాడుతూ... దేవరకొండ నుంచి బస్సు సర్వీసులను చండూరు మీదుగా నల్లగొండ జిల్లా కేంద్రానికి కనీసం రెండు - ముడు బస్సు...