ఘాట్ కేసర్ మండల ముసీ నది ల్యాండ్ పూలింగ్‌పై అవగాహన సదస్సు

ఘట్‌కేసర్ మండల పరిధిలోని కొర్రెముల్ల, ఎదులాబాద్, ముత్వెల్లిగూడ, కాచవాని సింగారం, ప్రతాప్ సింగారం గ్రామాల్లో ముసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ ఎమ్మార్వో చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పీసీబీ సభ్యుడు శరత్ చంద్రారెడ్డి పాల్గొని రైతులు, గ్రామస్తులకు ల్యాండ్ పూలింగ్ విధానం, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు, అభివృద్ధి అవకాశాలపై వివరించారు. అధికారులు మాట్లాడుతూ, ముసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాల వల్ల ప్రాంతీయ...