ఘట్‌కేసర్ ఏప్రిల్ 22 (ప్రజావాణి): మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, ఘట్‌కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ విభాగం పరిధిలోని ఘనపూర్ గ్రామం పవర్ గ్రిడ్ సమీప కాలనీలో త్రి ఫేజ్ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వేసవి కాలంలో కాలనివాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను గుర్తించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి వెంటనే చర్యలు తీసుకునేలా కృషి చేశారు.
వేముల మహేష్ గౌడ్ కృషితో ఈ రోజు కాలనీలో సింగిల్ ఫేజ్ విద్యుత్‌ను త్రి ఫేజ్ విద్యుత్‌గా మార్చి ప్రజలకు సౌకర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ సహాయ విద్యుత్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి, లైన్ పరిశీలకుడు నర్సయ్య, కాలనీవాసులు వేముల మహేశ్వర్ గౌడ్, వేముల కుమార్ గౌడ్, నాయకులు తాటికొండ మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనపూర్ చుట్టుపక్కల కాలనీవాసులు తమ సమస్యను త్వరగా పరిష్కరించినందుకు వేముల మహేష్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.