prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 8:06 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఘనంగా KCR 72వ జన్మదిన వేడుకలు

ఘనంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు 72వ జన్మదిన వేడుకలు

కేసీఆర్ మరొకసారి CM కావాలని కోరుకున్న బిఆర్ఎస్ నాయకులు సింహాచలం జగన్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్ ఎండపల్లి ఫిబ్రవరి 17(ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 72వ జన్మదిన వేడుకలను ఎండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని, అలాగే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే పదవిని చేపట్టి, వారికి మరొకసారి ప్రాతినిత్యం వహిస్తూ పార్టీని ముందుకు సాగించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్, శానబండ సర్పంచ్ గాదం భాస్కర్, మాజీ సర్పంచ్ లు మారం జలంధర్ రెడ్డి, గంధం లక్ష్మీ నారాయణ, రాజారాంపల్లి ఉప సర్పంచ్ మెరుగు జానీ, దాసరి కొమురయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షుడు చింతల తిరుపతి, పడిధం వెంకటేష్, ఇప్పల రాజ్ కుమార్, పడిధం నారాయణ, ఉప్పు రాజయ్య, ముక్తి చందు, భారత రాజు, గౌరి చిరంజీవి, జగతి కుమార్, గంధం తిరుపతి,రవి, బైకాని రవి, రాజేశం తదితరులు పాల్గొన్నారు.