prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 3:28 pm Digital Edition : RAJASHEKARREDDY

ఘనంగా 7వ వార్డు సభ్యులు కొంకటి సురేష్ జన్మదిన వేడుకలు

 

బెజ్జంకి,ఏప్రిల్ 14(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 7వ వార్డు సభ్యులు కొంకటి సురేష్ జన్మదిన వేడుకలను గుగ్గిళ్ల గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాల్గొన్న యూత్ సభ్యులు ముందస్తుగా కొంకటి సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, శాలువాతో ఘనంగా సన్మానించి ,దేవుడి ఆశీస్సులతో ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని దేవుడిని మనసారా వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కొంకటి సంపత్,బోయిని ప్రశాంత్,కొంకటి కుమార్,కేడిక రాజశేఖర్ రెడ్డి,కొంకటి సతీష్, కొంకటి అశోక్,లింగాల బాబు, సుధమల్ల ప్రశాంత్, నంగునూరి రాజు,సంపతి చంద్రరెడ్డి, శ్రీధర్, జెరిపోతు కిరణ్,యూత్ సభ్యులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.