ఘనంగా శ్రీనివాస్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ సాయి బాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు
మేడిపల్లి జూలై 29( మన ప్రజావాణి)బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ సాయిబాబా దేవాల యంలో గురు పౌర్ణమి మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు,అర్చనలు నిర్వహించారు.వేద పండితుల మంత్రో చ్ఛారణల మధ్య పంచామృతాభిషేకం, పాలాభిషేకం,హారతి నిర్వహించడం జరిగింది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందారు.అనంతరం సాయినామ సంకీర్తన, భజన కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావ రణాన్ని నెలకొల్పాయి. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహాప్ర సాదాన్ని పంపిణీ చేశారు. అన్నదాన వితరణ కార్యక్రమంలో సుమారుగా 2000 నుంచి 2500 భక్తులు పాల్గొన్నారు, ఆలయ కమిటీ సభ్యులు, దాతలు,సేవాదళ సభ్యులు ఉత్సవాల విజయవంతానికి సహకరించారు.గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాను గురుస్వ రూపుడిగా భావించి దేశవ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు,భజనలు,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.గురు పౌర్ణమి అనేది భారతీయ సంస్కృతిలో గురువుల పట్ల కృతజ్ఞత,గౌరవం, భక్తిని వ్యక్తపరిచే పవిత్రమైన పర్వదినం. దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. వేదాలను విభజించి, మహాభారతం వంటి మహాగ్రంథాలను రచించిన మహర్షి వేదవ్యాసుని జయంతిగా ఈ రోజును భావిస్తారు.ఈ రోజున సాధారణంగా:గురువులను,ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను సత్కరించి ఆశీర్వాదం పొందుతారు.
పూజ,ధ్యానం,జపం, దానధర్మాలు చేస్తారు.
గురువు చూపిన మార్గంలో నడవాలని సంకల్పిస్తారు.
“అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే ప్రతి గురువుకూ హృదయపూర్వక నమస్సులు.మీ జీవితంలో జ్ఞానం,విజయం,ఆనందం నిండాలని కోరుకుంటూ మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు,
ఈ కార్యక్రమంలో
అధ్యక్షుడు తోటకూర చందర్ యాదవ్,దొంతి లింగం,తోటకూర రవీందర్ యాదవ్,కీసరి శేఖర్ రెడ్డి,ఏ శివకుమార్, సురేందర్ చారీ,వీర చందర్,శ్రీనివాస్,
వై వెంకటేశ్వరా రావు,
పిఎల్.మధుసూదన్, డాక్టర్ రాంచందర్,
ప్రభాకర్ పంతులు,సాయి పంతులు,నాగుల లక్ష్మి,
సాయి కుమారి,జనతా గారాజీ,చంద్రలు,లీల,హేమ,లక్ష్మి,లలిత రెడ్డి, పద్మ,శృతి,శ్యామలమ్మా,
ఉమా,లావణ్య భక్తులు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

