ఘనంగా వకీల్ సాబ్ జన్మదిన వేడుకలు…. మైసిగండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు – భక్తులకు అన్నదానం
హైదరాబాద్, జూలై 28 (ప్రజా వాణి): సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే, ప్రజల్లో "వకీల్ సాబ్"గా ప్రత్యేక గుర్తింపు పొందిన కందికొండ వంశీధర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆత్మీయ మిత్రబృందం ఆధ్వర్యంలో మంగళవారం మైసిగండి శ్రీ మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రులు అమ్మవారిని దర్శించుకుని వంశీధర్‌కు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుతూ ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, ఏ కష్టం వచ్చినా "నేనున్నాను"...