హైదరాబాద్, జూలై 28 (ప్రజా వాణి): సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే, ప్రజల్లో “వకీల్ సాబ్”గా ప్రత్యేక గుర్తింపు పొందిన కందికొండ వంశీధర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆత్మీయ మిత్రబృందం ఆధ్వర్యంలో మంగళవారం మైసిగండి శ్రీ మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మిత్రులు అమ్మవారిని దర్శించుకుని వంశీధర్‌కు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుతూ ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, ఏ కష్టం వచ్చినా “నేనున్నాను” అంటూ ధైర్యం చెప్పే మంచి మనసున్న వ్యక్తిగా కందికొండ వంశీధర్‌ను అభివర్ణించారు. న్యాయం కోసం నిరంతరం నిలబడుతూ, యువతకు ఆదర్శంగా మారి, ప్రజల మధ్య ఒక కుటుంబ సభ్యుడిలా మెలుగుతున్నారని కొనియాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సేవలందిస్తున్న వంశీధర్‌కు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతుండటం ఆనందదాయకమని పేర్కొన్నారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళ్యాణ్ నాయక్, ప్రశాంత్ నాయక్, వినోద్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రావుల శ్రీకాంత్, సీనియర్ జర్నలిస్ట్ యాదగిరి గౌడ్, మహేందర్ నాయక్, సైదులు గౌడ్, కొండమడుగుకు చెందిన కె. సాయినాథ్, అభిమానులు, స్థానిక నాయకులు పాల్గొని కందికొండ వంశీధర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.