ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ రెండో సంస్థాపన వేడుక 

  ఘట్‌కేసర్, జూలై 16: సమాజ సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ సభ్యులు మరింత చురుకుగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కె. గోవిందరాజ్ పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్‌లోని నారాయణ గార్డెన్‌లో గురువారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ రెండో సంస్థాపన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించారు. సంస్థాపన అధికారిగా లయన్ రమేష్ లక్ష్మణ్, ఇండక్షన్ అధికారిగా లయన్ డాక్టర్ జైన్ రమేష్...