- ఘట్‌కేసర్, మే 16 (ప్రజావాణి): బీజేపీ పోచారం డివిజన్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్ జన్మదినోత్సవాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సురేష్ నాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను నాయకులు కొనియాడుతూ, ప్రజల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు వరికుప్పల గిరి, ప్రధాన కార్యదర్శులు కోన మల్లేష్, రేతి వెంకటేష్, కార్యకర్తలు బాలు, వంశీతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
