ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు..ఆశయాల సాధనకు యువత ముందుకు రావాలి.
తిరుమలాయపాలెం,ప్రజావాణి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. అమరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాకరవాయి యాదవ సంఘం ఉపాధ్యక్షులు గుండాల వెంకన్న మాట్లాడుతూ..దొడ్డి కొమురయ్య రైతుల కోసం చేసిన త్యాగాలు, ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన ఆశయాలను...