prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 11:26 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘనంగా ఘట్కేసర్‌లో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

ఘట్కేసర్, మే 28 : మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన ఎన్ టి రామరావు 103వ జయంతిని ఘట్కేసర్‌లో ఘనంగా నిర్వహించారు. మేడ్చల్–మల్కాజ్గిరి పార్లమెంట్ అడక్ కమిటీ మెంబర్ వేముల సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వేణుగోపాలరావు, జేఏసీ చైర్మన్ మారం లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి, సామల జగన్మోహన్ రెడ్డి, మధు కొర్రెముల, బత్తుల మహేష్ గౌడ్, రాములు గౌడ్, పూస నర్సింగ్ రావు, నర్సింగ్, అందోజి శ్రీనివాస్ చారి, అలియాబాద్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.