prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 2:52 pm Digital Edition : RAJASHEKARREDDY

ఘనంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం “పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి పాడిరైతు సహకరించాలి” -కరీంనగర్ పాల డైరీ అధ్యక్షులు కేడిక మధుసూదన్ రెడ్డి

 

బెజ్జంకి, జూలై 14(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో పశువులకు గాలికుంటు (ఎఫ్‌ఎండీ) వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పశువులను అంటువ్యాధుల నుంచి రక్షించి పాల ఉత్పత్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ టీకాలను అందించారు.ఈ సందర్భంగా కరీంనగర్ పాల డైరీ అధ్యక్షులు కేడికే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులు తమ పశువులకు ముందస్తుగా ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.గాలికుంటు వ్యాధిని నివారించడంలో టీకాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పాల డైరీ సూపర్వైజర్ ధనరాజ్, డైరీ డైరెక్టర్లు తడిసిన రాజిరెడ్డి, పశువైద్య అధికారులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.