ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) కనిగిరి
.ప్రజా ఉద్యమ నేత, నిస్వార్ధ సేవకుడు కామ్రెడ్ హనీఫ్–సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నారాయణ వర్ధంతి పురస్కరించుకుని సేవాహిత కార్యక్రమాలు కార్మికులకు,పేదలకు దుస్తులు, బియ్యం పంపిణీ, ఆల్పాహరం ఏర్పాటు– హానీఫ్ నగర్‌లో చలివేంద్ర ఏర్పాటు .తాను నమ్మిన కమ్యునిస్టు సిద్ధాంతాల కోసం.. కడవరకు పనిచేసి.. ఇంటిపేరునే కామ్రెడ్‌గా గుర్తింపు నొందిన ప్రజా ఉద్యమనేత.. నిస్వార్ధ ప్రజా సేవకుడు కామ్రెడ్ సయ్యద్ హనీఫ్ అని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. కామ్రెడ్ సయ్యద్ హనీఫ్ 35వ వర్ధంతిని బుధవారం కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక 10వ వార్డులోని హనీఫ్ నగర్‌లోని స్థూపం వద్ద ఆపార్టీ మండల కార్యదర్శి జీపీ రామారావు అధ్యక్షతన వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ కనిగిరి మేజర్ గ్రామ పంచాయతికి ఉప సర్పంచ్‌గా 20 ఏళ్లు పనిచేసిన.. హనీఫ్ ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్మిక నేతగా, రైతు, కూలి నేతగా ప్రజా పక్షాన అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. దున్నేవాడికే భూమి నినాదంతో కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం, పామూరు మండలాల్లో అనేక భూ పోరాటాలు చేశారన్నారు. భూ ఉద్యమాల ద్వార 3 వేల ఎకరాలను పేదలకు పంచేందుకు హనీఫ్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. సాగర్ కుడికాలువ సాధన, కనిగిరికి వెలిగొండ జలాలల సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో హనీఫ్ క్రీయాశీలకంగా పనిచేశారన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకులు ఎనుబరి రవీంద్రబాబు మాట్లాడుతూ కనిగిరి తాలుకాలో కమ్యునిస్టు పార్టీ బలోపేతంకు, గ్రామ గ్రామన కమ్యునిస్టు శాఖల ఏర్పాటుకు హనీఫ్ అహర్నిశలు కృషి చేశారని కీర్తించారు. నేటి తరం యువతకు హనీఫ్ జీవితం ఆదర్శనీయమన్నారు. తన హాయంలో చేసిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నేటికి పట్టణంలో ఆనవాళ్లుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్ని వత్తిళ్లు వచ్చిన..ఎన్ని బెదిరింపులు చేసినా.. ఎందరో ప్రలోభాలు పెట్టినా.. తలవొగ్గక కడ శ్వాస వరకు కమ్యునిస్టుగానే జీవించి హనీఫ్ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. పలువురు నేతలు మాట్లాడుతూ కమ్యునిస్టు ఉద్యమ నేత కామ్రెడ్ హనీఫ్ చేసిన పోరాటాలు నేటి యువతకు స్ఫూర్తి దాయకమన్నారు.
పలు సేవాహిత కార్యక్రమాలు.కామ్రెడ్ హనీఫ్ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబసభ్యులు, పలు సేవాహిత కార్యక్రమాలు చేపట్టారు.మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ, ఆల్ఫాహారం ఏర్పాటు చేశారు.అలాగే హనీఫ్ నగర్‌లో చలివేంద్రం ఏర్పాటుచే శారు.కార్యక్రమాల్లో ఏజీపీ పాశం పిచ్చయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ యాసిన్, న్యాయవాదుల బార్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్‌డీ షాహీద్ మహ్మద్ ఏఐటీయూసీ మాజీ కోఆప్షన్ సభ్యులు పీర్ల మస్తాన్‌వలి,మాజీ కౌన్సిలర్లు ఎస్‌డీ జిలాని,సయ్యద్ నాయబ్ రసూల్,విజేత విద్యా సంస్థల అధినేత పసుపులేటి అరుణోధర్, స్‌డీ మౌలాలి(ఆర్ట్),పఠాన్ ఖాదర్ ఖాన్ ఎస్‌కే ఎం పీరా,సయ్యద్ ఖాదర్ మస్తాన్,ఎల్‌ఐసీ నారాయణ,పఠాన్ బాబుఖాన్,పఠాన్ అయుబ్ ఖాన్ కాబు ఖాన్,ఎస్‌కే ఖాజా పీర్,సీపీఐ,ఏఐటీయూసి,ఏఐఎస్‌ఎఫ్,ఏఐవైఎఫ్, రైతు,కూలి సంఘాల నాయకులు గుజ్జుల బాలిరెడ్డి,ఎస్‌కే ఖాదర్ వలి, ఎస్‌కే ఖాశింపీరా,ఎస్‌డీ అమ్రుల్లా,ఎస్‌డీ మౌలా సయ్యద్ షరీఫ్,ఎస్‌కే నాసర్ వలి,మీరావలి,కనమర్ల కృష్ణారెడ్డి,ఇమాం హుస్సేన్,సర్ధార్,ఇస్మాయిల్,సీహెచ్ పవన్ కళ్యాణ్,ఎస్‌కే తాహీద్, జీవన్ తదితరులు పాల్గొన్నారు