prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 8:28 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘనంగా ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు నిర్వహణ

ఘట్‌కేసర్, జూలై 8: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమాల నేత, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ విజయసారథి, పద్మశ్రీ పురస్కార గ్రహీత మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలను కూడా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ ఘట్‌కేసర్ మండల అధ్యక్షుడు గుండె ఉపేందర్ మాదిగ హాజరై ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మందకృష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, సామాజిక న్యాయం కోసం ఎంఆర్పీఎస్ ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కడపోల్ల కర్ణాకర్ మాదిగ, మాజీ మండల అధ్యక్షుడు జగన్ మాదిగ, సీనియర్ నాయకులు రోడ్డ యాదగిరి మాదిగ, నరేష్ మాదిగ, జగదీష్ మాదిగ, ఇరిటం గణేష్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జిల్లా నాయకుడు దండు శివకృష్ణ మాదిగ,

విద్యార్థులు భరత్, ప్రశాంత్, దినేష్ కుమార్, ఉదయ్, శివప్రసాద్, జయంత్, కేశవులు, అశోక్, మణికాంత్, వేణు, సిద్దు, గణేష్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమ వివరాలను ఎంఆర్పీఎస్ ఘట్‌కేసర్ మండల ప్రధాన కార్యదర్శి జమ్మిగారి గణేష్ వెల్లడించారు.