ఘనంగా అనురాగ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం 2,789 మంది విద్యార్థులకు పట్టాలు పంపిణీ– పద్మశ్రీ చింతకింది మల్లేశంకు గౌరవ డాక్టరేట్
ఘాట్ కేసర్, జూలై 4 (ప్రజావాణి): అనురాగ్ విశ్వవిద్యాలయం 3వ వార్షిక స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, సైన్సెస్, వ్యవసాయ విభాగాలకు చెందిన మొత్తం 2,789 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. పట్టభద్రులు, వారి కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, పారిశ్రామిక రంగ ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఏడాది పట్టభద్రులలో 2,193 మంది బి.టెక్ విద్యార్థులు ఉండగా, 44 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు. అదనంగా 155 మంది ఎంబీఏ,...