ఘట్‌కేసర్ 6వ డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్

ఘట్‌కేసర్, జూలై 22: ఘట్‌కేసర్ 6వ డివిజన్ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఘట్‌కేసర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. బాల్యం నుంచే హిందుత్వ భావజాలంతో పాటు గోరక్షణ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న అనిల్ గౌడ్, ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు పలు హిందూ సంస్థల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గత ఐదేళ్లుగా ఘట్‌కేసర్ మున్సిపల్ బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా సేవలందించిన ఆయన...