ఘట్‌కేసర్ సర్కిల్‌లో హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డిప్యూటీ కమిషనర్ వాణి….. పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారుల హెచ్చరిక
ఘట్‌కేసర్, జూలై 10: ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పలు హోటళ్లలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి నీలీషా, ఘన వ్యర్థాల నిర్వహణ విభాగం ఉప కార్యనిర్వాహక ఇంజనీర్, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా టులిప్స్ రెస్టారెంట్, ఆర్ రాయల్ బావర్చి, పరివార్ రెస్టారెంట్, అక్షిత్స్ టాండూరి ఫ్యూజన్ ఢాబాలను పరిశీలించారు. వంటశాలల పరిశుభ్రత,...