ఘట్కేసర్ సర్కిల్‌లో ఎస్‌ఐఆర్‌పై సమీక్ష సమావేశం…. ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం అవసరం: డిప్యూటీ కమిషనర్ వాణి
ఘట్‌కేసర్, జూలై 17: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వాణి అధ్యక్షతన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్‌ఐఆర్)పై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వాణి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, లోపాలు లేకుండా జరగాలంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని కోరారు. అర్హులైన...