
మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్, ఘట్కేసర్ డివిజన్‌లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి డివిజన్ డిప్యూటీ కమిషనర్ వాణి మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సమాజంలోని ప్రతి వర్గానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహానీయుడిగా ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మేకల దాస్ ప్రధాన కార్యదర్శి ఇర్రీటం శ్రీనివాస్ సింగిరెడ్డి రాంరెడ్డి మాజీ కౌన్సిలర్ కడపల మల్లేష్ మామిళ్ళ ముత్యాల యాదవ్ కాలేరు రామోజీ కొంతమ్ అంజిరెడ్డి ఖయ్యూం సురేష్ నాయక్ బండారి రాందాస్ కడపోల్ల బిక్షపతి కట్కూరి నర్సింగరావు రహమాన్ బొక్క సత్తిరెడ్డి, జేఏసీ నాయకులు, మారం లక్ష్మారెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, బచ్చు నగేష్ కుమార్ గుప్త, బచ్చు ప్రమోద్, అల్లు కమలాకర్, చందుపట్ల వెంకటరెడ్డి, బండారు ఆంజనేయులు గౌడ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అంబేద్కర్ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.