ఘట్కేసర్ రైల్వే వంతెనకు రూ.3.87 కోట్ల నిధులు మంజూరు
ఘట్కేసర్, మే 5(ప్రజావాణి): ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మొత్తం రూ.3,87,54,833 విడుదల చేసినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. ఈ నిధులు మే 5న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాలో రెండు విడతలుగా జమయ్యాయి. మొదటి విడతగా రూ.2,90,22,744, రెండో విడతగా రూ.97,32,089 జమ అయినట్లు అధికారులు తెలిపారు. మెడ్చల్–మల్కాజిగిరి పరిధిలోని ఘట్కేసర్ ప్రాంతంలో రైల్వే వంతెన నిర్మాణ పనుల కోసం...