ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలి.. భూ బాధితులకు న్యాయం జరగాలి: కొమ్మిడి విక్రాంత్ రెడ్డి

ఘట్కేసర్, జూలై 19: ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి భూ బాధితులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని బీజేవైఎం ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘట్కేసర్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు ముందే ప్రారంభమైన ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం విచారకరమన్నారు. భూ సేకరణలో నష్టపోయిన కుటుంబాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో...