ఘట్‌కేసర్ మండల ఏఐవైఎఫ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…. యువజన సమస్యలపై ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపు

ఘట్‌కేసర్, ఆగస్టు 5: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఘట్‌కేసర్ మండల మహాసభలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సల్మాన్ బేగ్, జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగం, విద్య, వైద్యం, ప్రభుత్వ ఖాళీల భర్తీ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వంటి ప్రజా సమస్యలపై ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి యువతను సంఘటితం...