ఘట్‌కేసర్ బ్రిడ్జి పూర్తయ్యే వరకు పాదరక్షలు ధరించను: యువమోర్చా అధ్యక్షులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి

  ఘట్‌కేసర్, మే 16: ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఘట్‌కేసర్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తై ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తూ యువమోర్చా అధ్యక్షులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘట్‌కేసర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తై ప్రజలకు ఇబ్బందులు తొలగాలని దేవుడిని ప్రార్థించానన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు తాను పాదరక్షలు ధరించనని శపథం చేసి తన సంకల్పాన్ని వెల్లడించారు. ప్రజల సమస్యలను దృష్టిలో...