prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 3:00 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్ బొడ్రాయి 2వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి

ఘట్‌కేసర్, మే 18: ఎంఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ 6వ డివిజన్ పరిధిలోని ఘట్‌కేసర్ గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి 2వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న మల్లారెడ్డి గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఎన్‌ఎఫ్‌సీ నగర్ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.