ఘట్కేసర్ పోలీసుల ఆధ్వర్యంలో “మీ సురక్ష” కార్యక్రమం నిర్వహణ
ఘట్కేసర్, మే 19 (ప్రజావాణి): మల్కాజ్గిరి సీపీ ఆదేశాల మేరకు ఘట్కేసర్‌లోని సన్‌షైన్ పార్క్‌లో “మీ సురక్ష” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ డీసీపీ కె. సురేష్ కుమార్, మేడిపల్లి డివిజన్ ఏసీపీ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ కె. సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇండ్లలో పనిచేస్తున్న వ్యక్తుల పూర్తి వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. భద్రతా పరమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా నేరాలను నివారించవచ్చని సూచించారు....