prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 2:07 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్కేసర్‌ పోలీసుల ఆధ్వర్యంలో “మీ సురక్ష” కార్యక్రమం నిర్వహణ

ఘట్కేసర్, మే 19 (ప్రజావాణి): మల్కాజ్గిరి సీపీ ఆదేశాల మేరకు ఘట్కేసర్‌లోని సన్‌షైన్ పార్క్‌లో “మీ సురక్ష” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ డీసీపీ కె. సురేష్ కుమార్, మేడిపల్లి డివిజన్ ఏసీపీ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా డీసీపీ కె. సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇండ్లలో పనిచేస్తున్న వ్యక్తుల పూర్తి వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. భద్రతా పరమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా నేరాలను నివారించవచ్చని సూచించారు.

కార్యక్రమంలో ఘట్కేసర్  సెక్టార్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి, సన్‌షైన్ పార్క్ ప్రెసిడెంట్, ప్రజలు  పాల్గొన్నారు.