ఘట్‌కేసర్ పరిధిలో “నేను సైతం 2.0” కార్యక్రమం – 100 సీసీటీవీ కెమెరాల ప్రారంభం.. భద్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం

ఘట్‌కేసర్, జూలై 7 (ప్రజావాణి): మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘట్‌కేసర్, ఎదులాబాద్, ఔషాపూర్, కొండాపూర్ గ్రామాల్లో “నేను సైతం 2.0” కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 100 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక...