ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
ఘట్‌కేసర్, జూలై 30: జిల్లా అదనపు కలెక్టర్ శుక్రవారం సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియతో పాటు భూభారతి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్ నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతి, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పెండింగ్ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే భూభారతి సేవల అమలు, భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారం, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను...