ఘట్‌కేసర్ ఆర్‌ఓబీ పనులను తక్షణమే ప్రారంభించాలి: బీజేపీ నిరసన
ఘట్‌కేసర్‌లో గత 17 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘట్‌కేసర్ బైపాస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఘట్‌కేసర్ 6వ డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆర్‌ఓబీ నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్ సత్తిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా...