prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 1:48 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్‌లో వైభవంగా రెండవ వార్షికోత్సవ బొడ్రాయి పండుగ లో పాల్గొన్న చామకూర భద్ర రెడ్డి

ఘట్‌కేసర్, మే 17 (ప్రజావాణి): ఘట్‌కేసర్‌లో నిర్వహించిన రెండవ వార్షికోత్సవ బొడ్రాయి పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నాయకుడు చామకూర భద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొడ్రాయి పండుగ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎర్రోళ్ల సత్తన్న బొడ్రాయి కమిటీ అధ్యక్షుడిగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈ వేడుకల్లో రాజబోయిన యాదగిరి, బండారి ఆంజనేయులు మాజీ కౌన్సిలర్, వెంకటరెడ్డి మాజీ కౌన్సిలర్, మేకల నర్సింగ్ రావు మాజీ ఎంపీటీసీ, రోడ్డ యాదగిరి, పోతకాని రాజు, డొక్కని బిక్షపతి, ఎజ్జల రఘు, కందుకట్ల బాబు, శీను రెడ్డి, గ్యార బాలయ్య, ఎర్రోళ్ల మైసయ్య, మేకల శ్రీను, మేకల బిక్షపతి, ఎజ్జల ఆనంద్, జగదీష్, రమేష్ తదితరులు పాల్గొని పండుగ విజయవంతానికి సహకరించారు.