prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 8:44 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్‌లో విద్యుత్ సరఫరా అంతరాయం

ఘట్‌కేసర్, జూలై 10: చెట్ల కొమ్మల కత్తిరింపు పనుల నేపథ్యంలో జూలై 11 (శనివారం) ఘట్‌కేసర్ విద్యుత్ విభాగం పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్‌ఎఫ్‌సీ నగర్ గ్రామంలోని అన్ని కాలనీలు, బొక్కనిగూడ గ్రామం మరియు పరిసర కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎదులాబాద్ వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, చందుపట్లగూడ వ్యవసాయ ప్రాంతం, మర్రిపల్లిగూడ వ్యవసాయ ప్రాంతం, బొక్కనిగూడ వ్యవసాయ ప్రాంతం, ఘనాపూర్ వ్యవసాయ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

విద్యుత్ వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని ఘట్‌కేసర్ సెక్షన్ సహాయ ఇంజనీర్ (ఆపరేషన్) విజ్ఞప్తి చేశారు.