ఘట్‌కేసర్‌లో విద్యుత్ సరఫరా అంతరాయం
ఘట్‌కేసర్, జూలై 27: ఘట్‌కేసర్ విద్యుత్ విభాగం పరిధిలో చెట్ల కొమ్మల కత్తిరింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూలై 28 (మంగళవారం) పలుచోట్ల విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బాలాజీనగర్ ఫీడర్, కొండాపూర్ వ్యవసాయ ఫీడర్ పరిధిలోని గాంధీనగర్, గీతామందిరం వెనుక ప్రాంతం, జగదాంబ థియేటర్ పరిసరాలు, మూడు గుడులు–బాలాజీనగర్, సాయిబాబా ఆలయం పరిసరాలు, వివేకానంద ఈడబ్ల్యూఎస్ కాలనీ, గురుకుల పాఠశాల వెనుక ప్రాంతం, బాలాజీనగర్, కొండాపూర్ వ్యవసాయ...