ఘట్‌కేసర్‌లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రూ.3.95 కోట్లతో “అందెశ్రీ స్మృతి వనం”కు శంకుస్థాపన రాష్ట్ర కవి అందెశ్రీ జయంతి వేడుకల్లో పాల్గొనున్న ముఖ్యమంత్రి

ఘట్‌కేసర్, జూలై 17: రాష్ట్ర కవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో శనివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొని రూ.3.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అందెశ్రీ స్మృతి వనంకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం అందెశ్రీ స్మృతి వనం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్...