ఘట్‌కేసర్, జూలై 17: రాష్ట్ర కవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో శనివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొని రూ.3.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అందెశ్రీ స్మృతి వనంకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ మేరకు శుక్రవారం అందెశ్రీ స్మృతి వనం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య వికాసానికి విశేష సేవలందించిన రాష్ట్ర కవి అందెశ్రీ జ్ఞాపకార్థం ఈ స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. అందెశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేయడంతో పాటు తెలంగాణ ఆత్మగౌరవం, భాషా వైభవం, సాంస్కృతిక సంపదను ప్రతిబింబించే కేంద్రంగా ఇది రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. రాష్ట్ర సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన చారిత్రక విశేషాలను భద్రపరిచే వేదికగా కూడా ఈ స్మృతి వనం నిలవనుందని వివరించారు.
రాష్ట్ర కవి అందెశ్రీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విలేకరుల సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, డీసీసీ కార్యదర్శి ముత్యాల్ యాదవ్, డిసిసి అధ్యక్షుడు ఇటుకల కృష్ణారెడ్డి, ఘట్‌కేసర్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, పోచారం అధ్యక్షుడు కర్రే రాజేష్, ఎదులబాద్ అధ్యక్షుడు సామల అమర్, బోడుప్పల్ అధ్యక్షుడు పోగుల దిలీప్ రెడ్డి, గడ్డన్నారం ఫ్రూట్స్ మార్కెట్ డైరెక్టర్ మచ్చేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, టీం రేవంత్ రెడ్డి సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ముల్లి జంగయ్య, కడపోళ్ల మల్లేష్, కోరుబోతు నాగరాజు, బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ఖయ్యూం, నర్రి శ్రీశైలం, కడపోళ్ల రాజు, మేకల నర్సింగ్ రావు, కొంతం అంజిరెడ్డి, ఉల్లి ఆంజనేయులు, బండారి ఆంజనేయులు గౌడ్, బద్దం నరసింహారెడ్డి, బొక్క సంజీవరెడ్డి, వినోద్ కుమార్, బొక్క సత్తిరెడ్డి, కేశవపట్నం ఆంజనేయులు పంతులు, మాజీ సర్పంచ్ మేడపైన వెంకటేష్ ముదిరాజ్, వేముల సంజీవ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
