ఘట్కేసర్‌లో ఎస్‌హెచ్‌జీ మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం
ఘట్కేసర్, ఏప్రిల్ 20 (ప్రజావాణి): ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఏ. వాణి మరియు ఇన్‌చార్జి ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ సురేష్ మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై విస్తృతంగా వివరించారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాలు, సబ్సిడీ పథకాలు, సామాజిక...