ఘట్‌కేసర్‌లో ఎఐటియుసి మండల 4వ మహాసభ…… మండల అధ్యక్షుడిగా బాలనర్సయ్య, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక

ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని మహిళ డ్వాక్రా భవనంలో ఎఐటియుసి మండల 4వ మహాసభ రాష్ట్ర సమితి సభ్యుడు కల్లూరి జయచంద్ర అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఎఐటియుసి జాతీయ సమితి సభ్యుడు రవిచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల పోరాటాల ఫలితంగా అమలులో ఉన్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్‌లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను బలహీనపరిచిందని విమర్శించారు. సంపన్న వర్గాలకు...