ఘట్కేసర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం

ఘట్‌కేసర్, మే 16 (ప్రజావాణి): ఘట్‌కేసర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, నిరుపేదలు, స్థానిక ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. సమాజ సేవే లక్ష్యంగా ప్రతి అమావాస్య రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. అన్నదానం మహాదానమని, సమాజంలో సేవా భావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధానకార్యదర్శి బచ్చు నగేష్...