ఘట్‌కేసర్‌లో అక్రమ ఎల్పీజీ గ్యాస్ దందా బట్టబయలు….ఎనిమిది సిలిండర్లు, 36 చిన్న గ్యాస్ సిలిండర్లు, ఆటో ట్రాలీ స్వాధీనం – ఇద్దరు అరెస్ట్

ఘట్‌కేసర్, ఆగస్టు 5: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్–9 వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అక్రమ ఎల్పీజీ గ్యాస్ దందాను పోలీసులు వెలికితీశారు. ఎస్‌వోటీ బృందం అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదంగా గ్యాస్ సిలిండర్లను ఆటో ట్రాలీలోకి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పూసా రామ్ (43) అనే గ్యాస్ సరఫరాదారు, అతని సహాయకుడు ఓం ప్రకాశ్ (32) సబ్సిడీపై లభించే గృహోపయోగ ఎల్పీజీ సిలిండర్లను లబ్ధిదారుల నుంచి కొనుగోలు...