గ్రోమోర్ పై రైతుల కన్నెర్ర
బీర్కూర్ మండల కేంద్రంలో గల గ్రోమోర్ ఎరువుల దుకాణం పై శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల రైతులు కన్నెర్రజేశారు. ఈ సందర్బంగా ఇప్పటికే ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటే బీర్కూర్ లో గల గ్రోమోర్ సిబ్బంది మరింతగా రైతులను సతాయిస్తున్నారని ఆరోపిస్తూ బీర్కూర్ మండల కేంద్రంలోని మల్లాపూర్ చౌరస్తాలో గల రోడ్డుపై భైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న బీర్కూర్ సర్పంచ్ అరిగే ధర్మతేజ రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు ఎరువుల విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రోమోర్ సిబ్బందిపై వెంటనే వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.